![]() |
![]() |
.webp)
అరియాన గ్లోరీ.. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న బ్యూటీ. బిగ్ బాస్ తో మంచి క్రేజ్ సంపాదించుకొని సెలబ్రిటీ అయిపోయింది. అరియాన.. మొదటగా తన కెరీర్ ని కుకింగ్ షోస్ తో మొదలు పెట్టింది. ఆ తర్వాత కామెడీ షోలకి యాంకర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చెయ్యడం అవి కాంట్రవర్సిటికీ దారితీయడంతో ఫేమస్ అయింది అరియాన.
బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత RGV తో కలిసి జిమ్ లో చేసిన ఇంటర్వ్యూ వైరల్ అయింది. ఆ తర్వాత అరియాన ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. ఇలా అరియనా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. బిగ్ బాస్-5 బజ్ కి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూ చేయడం ద్వారా అరియాన పాపులర్ అయింది. ఇంటర్వ్యూలో అరియానా కంటెస్టెంట్ తో సూటిగా మాట్లాడే తీరు అందరిని ఆకట్టుకుంది. అరియానకి ఇన్ స్టాగ్రామ్ లో వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
అరియాన తన ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు రీల్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. ఎప్పుడు హాట్ ఫోటోలతో ట్రెండింగ్ లో ఉండే ఈ భామ తాజాగా నెట్టింట కొన్ని బోల్డ్ ఫోటోలని వదిలింది. అవి చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. కెన్ ఐ బీ యువర్ ఫేవరెట్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చేసింది. మొత్తం ఆరు ఫోటోలతో కూడిన ఫోస్ట్ ని షేర్ చేసిన అరియానా.. అందులో భిన్నమైన యాంగిల్స్ లో కనబడుతుంది. అంతా రామ్ గోపాల్ వర్మ మహిమ అని ఒకరు కామెంట్ చేయగా.. స్టన్నింగ్ అని మరొకరు హాట్ అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇంకా చాలావరకు నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి. ఇక ఈ కామెంట్లని అరియాన చూసిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఇన్ స్ట్రాగ్రామ్ లో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
![]() |
![]() |